Ex-DGP Sensational Comments on CM
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఫైర్
మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం తమ్ముడు సంతోష్ రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవడం వల్లే తనను డీజీపీ పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. అవసరమైతే సీఎంపై కోర్టుకు వెళ్తానన్నారు. మరోవైపు ముఖ్యమంత్రికి తెలంగాణ రావడం ఇష్టం లేదని దినేష్ రెడ్డి అన్నారు.
తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని మీడియాతో చెప్పాలని సీఎం తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. గచ్చిబౌలిలో న్యాయవాదుల సదస్సుకు అనుమతి ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. అనంతపురం ఎస్పీని సస్పెండ్ చెయ్యాలని కూడా తనపై ఒత్తిడి వచ్చిందన్నారు. తాను చేసిన ఆరోపణలన్నింటికీ తన దగ్గర ఆధారాలున్నాయని దినేష్ రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment