Pages

Click here

Translate

Indianpress365days All News Papers

Eenadu News Paper+ETV Live

Andhra Jyithi News Paper + ABN Live TV

Sakshi News Paper+Sakshi Live TV

Tuesday, 8 October 2013

Telangana Rastra Erpatupai Gandara Golam

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రోజుకో ప్రకటన: గందరగోళంలో ప్రజలు

     తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రోజుకో ప్రకటన ప్రజలను మరింత గందరగోళంలో పడేస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై తొలిసారిగా స్పందించిన కేంద్రం రాష్ట్ర విభజనపై పక్కా వ్యూహం ప్రకారమే కదులుతున్నట్లు కనపడుతోంది.
    ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేదిలేదని చెప్తూ వచ్చిన ప్రభుత్వం సీమాంధ్ర ఆందోళనలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర విభజన విషయంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరుగదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
    రాష్ట్ర విభజన నేపధ్యంలో సమస్యల పరిష్కరానికి ఫార్ములాను రూపొందిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆందోళన విరమించి ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిపేందుకు సీమాంధ్రులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
   కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల సమస్యలను సానుభూతితో పరిశీలిస్తుందని హామీ ఇచ్చిన ఆయన. పూర్తి సంతృప్తి కలిగించే విధంగా, అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా ఒక ఫార్ములాను రూపొందిస్తామన్నారు. ఇటు సీమాంధ్రలో అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు.
   విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. పన్నులు, విభజన, రాయితీలు వంటి సమస్యలు ఏవైనా ఉంటే మంత్రుల కమిటీతో చర్చించవచ్చని దిగ్విజయ్ సూచించారు. ఇదే సమయంలో హైదరాబాద్ కు సంబంధించి దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
    హైదరాబాద్ పై ఎవరి పెత్తనానికి ఒప్పుకోమని వారు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్నే టిఆర్ ఎస్ పార్టీ కోరుతుందన్నారు. హైదరాబాద్ పై కేంద్రం పెత్తనం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టేనని వారంటున్నారు.
   మరోవైపు రాష్ట్ర విభజన అంశాన్ని పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. రాష్ట్ర విభజనకు సంభందించి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేబినెట్ బృందం తొలిసారిగా సమావేశమైంది.
Telangana Rasta Erpatupai Gandara Golam, AP latest Hot topics News, AP Latest News updates, hot news, latest News, latest News updates, Excellent 

No comments:

Post a Comment